ఈ లక్నవరం సరస్సు తెలంగాణ లోని గోవిందరావు పేట మండలం లోని ,ములుగు జిల్లాలో ఉన్నది . ఇది వరంగల్ నుంచి అయితే 80Kms .హైదరబాద్ నుండి అయితే 210kms వరకు ఉన్నది ..మేము అయితే 3 ఫ్యామిలీస్ కలిసి హైదరాబాద్ నుంచి tempo మాట్లాడుకుని వచ్చాము.
ఇది తెలంగాణలో ప్రసిద్ది చెందిన మంచి పర్యాటక ప్రాంతం.ఇక్కడకు రోజూ కొన్ని వందలాది మంది పర్యాటకులు వచ్చి , ప్రకృతి తో ఏకమైన ఈ లక్నవరం సరస్సు అందాలని ఆస్వాదిస్తూ ఉంటారు. కళలకు అత్యంత ప్రాధన్యతను ఇచ్చే ఆనాటి కాకతీయ రాజు ప్రతాప రుద్రుని చేతుల మీదగా రూపు దిద్దుకుంది. నేటి తెలంగాణ ప్రభుత్వంలో "Rope Suspension Bridge" తో నూతనంగా ఆధునీకరించబడి పర్యటకులచే విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎత్తైన కొండల మధ్య నిర్మింపబడిన ఈ సరస్సు ,చిన్న చిన్న దీవులను ఆవాసరంగా చేసుకుంటూ,చుట్టూ ప్రవహిస్తున్న నీటితో ఇది వెన్నెల ఉషస్సు లో, దివ్యంగా తన అందాల తో , నర్తిస్తున్నట్టు ఉంటుంది.ఇక్కడకు వచ్చిన పర్యాటకులు ఉండటానికి అద్దాలతో నిర్మించి చక్కటి view కనపడేట్టు గా వసతి, సాహసాలతో కూడిన బోట్ డ్రైవింగ్, సైక్లింగ్,చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా కార్స్ రైడింగ్, Relax అవ్వటానికి , అలసటను తీర్చుకునేందుకు "Massage Chair" ఇలాంటివి ఈ resorts లో సమకూర్చబడినాయి. కంటికి కనిపించినంత దూరమంత ఆకుపచ్చని చెట్లతో ,మధ్యలో జలకళ తో చాలా రమణీయంగా ఉంటుంది .దీనిని ఒక మినీ ద్వీపంగా (island) చెప్పు కొనవచ్చు. ఉరుకులు ,పరుగుల జీవితంలో కాసేపు మనల్ని మనం మర్చిపోయి హాయిగా, ఫ్రెండ్స్ తోటి కాని,ఫ్యామిలీస్ తోటి కానీ ఆనందంగా ,సరదాగా గడపటానికి అనువైన ప్రదేశం ఈ లక్నవరం. మన ఒత్తిడిని తగ్గించుకుంటూ , మానసిక ప్రశాంత లభించాలంటే సుందరమైన నీటి వనరున్న ప్రదేశం ఈ లక్నవరం. పిల్లలకూ, పెద్దలకూ మంచి అనుభూతి ని వారి వారి స్వీట్ మెమోరీస్ గా నిలుపు కోవాలంటే ఇది ఉత్తమమైన location అనే చెప్పాలి. ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి చూడదగ్గ ప్రదేశం . అద్భుతమైన పర్యాటక కేంద్రం ఈ లక్నవరం...ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఈ ప్రదేశం ఒక వరం..
మేము అయితే ఒక సూర్యాస్తమయం & సూర్యోదయం చూసి ఉన్నాం ఇక్కడ ..రాత్రి నీటిలోని అలలు చంద్రుని చల్లదనానికి తపిస్తూ ,ఆ చంద్రుని కాంతిలో మా రూం లోనుంచి తన సొగసును విప్పారిన అందం చూసాం అలానే ఉదయాన్నే మంచు తుంపరలు సరస్సులోని నీటిని టచ్ చేసి వెనక్కి వెళుతూ ఉన్నప్పుడు ఆ పొగమంచు కవ్వింపుగా నడవటం చూసాం ..ఈ సన్నివేశం మంచి రొమాంటిక్ అనే చెప్పొచ్చు.
No comments:
Post a Comment